: హోదాపై మాట్లాడనీయకుండా పవన్ గొంతును ఏ ప్యాకేజీ నొక్కేసిందో చెప్పాలి: ఎమ్మెల్యే రోజా
ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడకుండా తనను తాను నియంత్రించుకుంటున్నానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ఏ ప్యాకేజీ ఆయన గొంతును నొక్కేసిందో పవనే చెప్పాలని సూటిగా అడిగారు. ఎన్నికల సమయంలో హెలికాప్టర్లలో ప్రచారం చేసిన పవన్ ఇప్పుడు ట్విట్టర్ కే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. టీడీపీ, బీజేపీలను ప్రశ్నించేందుకు ఎందుకు భయపడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని పవన్ ను నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే మోదీ, చంద్రబాబులను ఆయన ప్రశ్నించాలని రోజా డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో ఢిల్లీలో నిర్వహిస్తున్న వైసీపీ దీక్షలో ఆమె ఈ మేరకు మాట్లాడారు. ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని, ఒక్కో ఎంపీ ఒక్కోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హోదాపై తీర్మానం చేద్దామంటే టీడీపీ పట్టించుకోలేదని ఆరోపించారు.