: అదరగొట్టిన 'శ్రీమంతుడు' తొలి వీకెండ్... కలెక్షన్స్ ఇవిగో!
మూడు రోజుల క్రితం విడుదలైన ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు' తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోగా, తొలి వీకెండ్ లోనే రూ. 50 కోట్లను వసూలు చేసిందని తెలుస్తోంది. విడుదలైన తొలిరోజున ఓవర్ సీస్ కలెక్షన్లతో కలిపి రూ. 31 కోట్లను చిత్రం వసూలు చేసిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కాగా, అమెరికాలో భారీ ఎత్తున విడుదలైన చిత్రం కలెక్షన్స్ సోమవారం నాటికి రెండు మిలియన్ డాలర్లను (సుమారు రూ. 13 కోట్లు) దాటుతుందని ట్రేడ్ అనలిస్టులు లెక్కలు కడుతున్నారు. తమిళనాట చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుండటంతో అక్కడ థియేటర్ల సంఖ్యను పెంచినట్టు తెలుస్తోంది.