: ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీలో భారీ అక్రమాలు... ఇందులో ఫిల్మ్ స్టార్స్ కూడా ఉన్నారు: హౌసింగ్ సొసైటీ సభా సంఘం అధ్యక్షుడు


హైదరాబాద్ లోని హౌసింగ్ సొసైటీ అక్రమాలపై 75 శాతం విచారణ పూర్తయిందని హౌసింగ్ సొసైటీ సభా సంఘం అధ్యక్షుడు ఆరూరి రమేష్ తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభా సంఘం నివేదిక సమర్పిస్తామని చెప్పారు. అయితే జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీల్లో భారీ అక్రమాలు జరిగాయన్నారు. ఫిల్మ్ నగర్ సొసైటీ అక్రమాలకు పాల్పడిన వారిలో ప్రముఖ ఫిల్మ్ స్టార్స్ కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా వదిలేదిలేదని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భూస్వాధీనం చేసుకోవాలని సభా సంఘం రికమెండ్ చేస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News