: పద్మావతి మహిళా వర్సిటీ బయట ఉద్రిక్తత... స్నాతకోత్సవాన్ని అడ్డుకునేందుకు ఏపీ స్టూడెంట్ జేఏసీ యత్నం
తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్నాతకోత్సవాన్ని అడ్డుకునేందుకు ఏపీ స్టూడెంట్ జేఏసీ యత్నించింది. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు వర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిపాటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులపై పోలీసులు చేయి చేసుకున్నారు. పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.