: ముగిసిన పోస్టుమార్టం... మునికోటి మృతదేహంతో తిరుపతికి బయలుదేరిన రఘువీరా, చిరంజీవి


ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మునికోటి మృతదేహానికి చెన్నైలో కొద్దిసేపటి క్రితం పోస్టుమార్టం పూర్తయింది. మొన్న తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ సమావేశం సందర్భంగా ఒంటికి నిప్పంటించుకున్న మునికోటి తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం అతడిని చెన్నై తరలించగా, కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. పోస్టుమార్టం ముగిసిన తర్వాత అతడి మృతదేహంతో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కొద్దిసేపటి క్రితం తిరుపతికి బయలుదేరారు.

  • Loading...

More Telugu News