: చెన్నై బయలుదేరిన రఘువీరా, చిరంజీవి... మునికోటి మృతదేహాన్ని తిరుపతికి తీసుకురానున్న నేతలు


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరారెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కొద్దిసేపటి క్రితం చెన్నై బయలుదేరి వెళ్లారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసుకున్న మునికోటి మృతదేహాన్ని రఘువీరా, చిరంజీవిలు దగ్గరుండి మరీ తిరుపతి తీసుకురానున్నారు. ఆత్మహత్యాయత్నంలో తీవ్ర గాయాలపాలైన మునికోటిని మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని కేఎంసీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన మునికోటి మృతదేహానికి నేటి సాయంత్రం తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని రఘువీరారెడ్డి, చిరంజీవి దగ్గరుండి తిరుపతి తీసుకొస్తారు.

  • Loading...

More Telugu News