: విశాఖ బయలుదేరిన చంద్రబాబు...మరికాసేపట్లో ‘మీ భూమి-మీ ఇంటికి’ అంకురార్పణ
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి విశాఖపట్నం బయలుదేరారు. మరికాసేపట్లో విశాఖ చేరుకోనున్న ఆయన అక్కడ ‘ మీ భూమి-మీ ఇంటికి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వం సరికొత్తగా రూపొందించిన ఈ పథకం భూ యజమానులకు వరంగా మారనుంది. భూమికి సంబంధించిన అన్ని పత్రాలను ఈ పథకం కింద ప్రభుత్వం యజమాని ఇంటి వద్దకే చేరుస్తుంది. ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు ‘ఏపీ మేడ్’ జియోమీ సెల్ ఫోన్లను కూడా ఆవిష్కరించనున్నారు.