: మా అమ్మాయి ఆత్మహత్యకు ప్రిన్సిపాలే కారణం: రిషితేశ్వరి తండ్రి


నాగార్జున యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఇరు రాష్ట్రాలను కలచివేసింది. ఈ ఉదంతంపై రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ స్పందించారు. తన కూతురి ఆత్మహత్యకు ప్రిన్సిపాల్ బాబూరావే కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై యూనివర్శిటీలో మరే అమ్మాయికి ఇలా జరగకూడదని... అప్పుడే తన కుమార్తె జీవించినట్టు భావిస్తానని చెప్పారు. తన కూతురిపై జరిగిన లైంగిక వేధింపులకు బాబూరావు పూర్తి స్థాయి సహకారాన్ని అందించారని ఆరోపించారు. ఈ నేరం చేసిన ప్రిన్సిపాల్ కు శిక్ష పడాల్సిందే అంటూ కంట తడి పెట్టారు.

  • Loading...

More Telugu News