: మైసూర్ కు ప్రథమ స్థానం దక్కడం సంతోషదాయకం: సిద్ధరామయ్య


స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్ లో మైసూరుకు పథమ స్థానం దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలకన్నా మైసూరు మెరుగైన స్థితిలో ఉండటం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రిగా, ఒక కర్ణాటక పౌరుడిగా గర్వపడుతున్నానని చెప్పారు. స్థానిక ప్రజల సహకారంతోనే మైసూరు ఈ విజయాన్ని అందుకుందని కొనియాడారు. ఇదే ఉత్సాహంతో రానున్న మైసూరు దసరా ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన ర్యాంకుల్లో మైసూరుకు ప్రథమ స్థానం వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News