: ఆంధ్రుల అధికారాన్ని తాకట్టు పెడుతున్న వెంకయ్య... అధికారానికి బానిస: కారెం శివాజీ
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ధ్వజమెత్తారు. అధికారానికి బానిస వెంకయ్యనాయుడు అంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయన తన పదవి కోసం తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడిన వెంకయ్యనాయుడు ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి బిల్లు తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం రేపు ఢిల్లీలో జగన్ చేపడుతున్న దీక్షకు తాము సంపూర్ణ మద్దతు పలుకుతున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హక్కు అని తెలిపారు.