: అమరావతి నిర్మాణంపై కీలక చర్చలు మొదలు
నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలన్న యోచనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఉదయం అధికారులతో కీలక చర్చలు జరిపారు. నిర్మాణం ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఏ భవంతులను ముందుగా నిర్మించాలి? కాంట్రాక్టులు ఏ పద్ధతిలో అప్పగించాలి? తదితర విషయాలపై అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్న సంస్థలు, నగర నిర్మాణ ప్రణాళికలోని కీలకాంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.