: నాగార్జున వర్శిటీ వైస్ చాన్స్ లర్ గా మహిళా ఐఏఎస్ అధికారిణి
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఇన్ చార్జ్ వైస్ చాన్స్ లర్ గా ఉదయలక్ష్మిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా ఉన్న ఉదయలక్ష్మిని ఏఎన్ యూ ఉప కులపతిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం వర్శిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో విద్యార్థినుల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించే ప్రయత్నంలోనే మహిళా అధికారిణిని వైస్ చాన్స్ లర్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.