: టెక్నాలజీ సృష్టించిన మరో అద్భుతం... కొవ్వొత్తితో సెల్ ఫోన్ చార్జింగ్
కొవ్వొత్తిని ఉపయోగిస్తూ, సెల్ ఫోన్ చార్జింగ్ సదుపాయాన్ని నేటి అత్యాధునిక సాంకేతికత దగ్గర చేసింది. ఆరు గంటల పాటు వెలిగే కొవ్వొత్తి నుంచి రెండు ఐఫోన్ లకు సరిపడినంత ఫుల్ చార్జింగ్ ఇచ్చే విద్యుత్ ను తయారు చేసుకోవచ్చని ఈ సాంకేతికతను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త వివరిస్తున్నారు. కొవ్వొత్తి నుంచి వచ్చే వేడిమిని రూపాంతరీకరణ చేసేందుకు, దీనికి అనుసంధానం చేసే చార్జర్ ఒక థర్మో ఎలక్ట్రికల్ జనరేటర్ గా ఉపయోగపడుతుందని, తద్వారా 2.5 ఓల్టుల విద్యుత్ ను సృష్టించవచ్చని తెలిపారు. దీన్ని యూఎస్బీ కేబుల్ సహాయంతో స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, ఫ్లాష్ లైట్లు వంటి వేటినైనా చార్జింగ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. గతంలో క్యాంప్ ఫైర్ లకు, క్యాంపింగ్ స్టవ్ లను వాడుతూ, చార్జర్లను తయారు చేసిన శాన్‌ఫ్రాన్సిస్కో వాసి స్టోవర్ దీనిని తయారు చేశారు. ఈ థర్మో ఎలక్ట్రికల్ జనరేటర్ ధర 65 డాలర్లుగా నిర్ణయించామని తెలిపారు. కాగా, ఈ ప్రొడక్టు అతి త్వరలో మార్కెట్లోకి రానుందని సమాచారం.