: అవినీతిని అరికట్టేలా చర్యలు: వెంకయ్యనాయుడు


ఇండియాలో అవినీతిని, లంచగొండితనాన్ని అరికట్టేలా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వివరించారు. ఈ ఉదయం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశ ఆర్థిక వృద్ధికి భూసేకరణ బిల్లు ఆమోదం పొందడం చాలా ప్రధానమని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లులో సవరణల కోసం విపక్షాలు మంచి సలహాలు ఇస్తే వాటిని తీసుకుని బిల్లులో పొందపరుస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధిని విస్మరించారని విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో కాంగ్రెస్ తదితర విపక్ష పార్టీల ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారని, ఈ స్థితి మారాలని అన్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News