: మహిళలను వివస్త్రలుగా చేసి క్షుద్రపూజలు... వరంగల్ జిల్లాలో కలకలం
క్షుద్రపూజల నిమిత్తం ఇద్దరు మహిళలను పట్టుకెళ్లిన కొందరు వ్యక్తులు వారిని నగ్నంగా మార్చి పూజలు తలపెట్టారు. ఈ ఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్ పరిధిలో జరిగింది. పట్టణ శివారు ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. ఇద్దరు మహిళలను బలవంతంగా ఎత్తుకెళ్లిన వ్యక్తులు వారిపై ప్రయోగాలకు సిద్ధం కాగా, మహిళలు కేకలు పెడుతూ పరుగులు తీసి రోడ్డెక్కారు. పోలీసుస్టేషనుకు వచ్చి ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఆ దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు.