: మరింత విషమించిన సువ్రా ముఖర్జీ ఆరోగ్యం, ప్రణబ్ తో మాట్లాడిన అద్వానీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ ఆరోగ్యం మరింతగా విషమించినట్టు తెలుస్తోంది. ఆమె స్వయంగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారని, ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. మరో రెండు రోజులు గడిస్తేనే ఆమె ఆరోగ్యంపై స్పష్టత వస్తుందని వివరించారు. కాగా, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కే. అద్వానీ ప్రణబ్ ముఖర్జీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఆమె ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చారని తెలుసుకున్న ప్రణబ్ తన ఒడిశా పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే.