: 'వందనాలమ్మా...' అన్న దరవు ఎల్లన్న పాటతో సోనియా భావోద్వేగం!


"తెలంగాణ ఇచ్చిన సోనియాకు వందనాలు..." అంటూ దరువు ఎల్లన్న పాటపాడుతుంటే, దానికి ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు కోరస్ పాడుతుంటే, పాటలోని పదాల భావం అర్థమై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ ఘటన వర్శిటీ విద్యార్థులు సోనియాను కలిసి తమ గోడు, తెలంగాణలో జరుగుతున్న పరిపాలనా విధానాన్ని గురించి వివరించిన సందర్భంగా జరిగింది. ఆ పాటను విన్న సోనియా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాస్వామ్య యుద్ధానికి విద్యార్థి క్యాడర్ ను సిద్ధం చేయాలని టీ-పీసీసీ నేతలకు సూచించారు. సోనియాను కలిసిన వారిలో ఓయూ జేఏసీ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, అధ్యక్షుడు లోకేష్‌ యాదవ్‌, కైలాష్‌ నేత, మానవతారాయ్‌, దరువు ఎల్లన్న తదితరులున్నారు.

  • Loading...

More Telugu News