: అమ్మాయిలూ... ఇలా చేతిని మెలితిప్పి, అలా డొక్కలో కొట్టాలి!: వీడియోలు విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు


ఢిల్లీ పోలీసులు మహిళల ఆత్మరక్షణకు ఉపకరించే వీడియోలను విడుదల చేశారు. ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఆత్మరక్షణకు ఉపయోగపడే పలు టెక్నిక్ లను ఆ వీడియోల్లో పొందుపరిచారు. తమను తాము ఎలా కాపాడుకోవాలి? దాడికి పాల్పడిన వ్యక్తిని ఎలా చిత్తు చేయాలి? అన్న అంశాలతో ఈ వీడియోలు రూపొందించారు. మార్షల్ ఆర్ట్స్ నిపుణులు సూచించిన సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ లను ఈ వీడియోల్లో ప్రదర్శించారు. ఈ వీడియోల్లో ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ ఉపోద్ఘాతం కూడా ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా వీటిని యూట్యూబ్ లో ఉంచారు.

  • Loading...

More Telugu News