: తిరుపతి ఘటనపై స్పందించిన జనసేన... ఘాటుగా వ్యాఖ్యానించిన సీపీఐ నారాయణ


తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ పోరు సభ సందర్భంగా ఓ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై జనసేన పార్టీ కార్యాలయం స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు వద్దని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కలిసి పోరాటం చేసి, ప్రత్యేక హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు. ప్రజల మనోభావాలతో ఆటలాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అటు, ఈ ఘటనపై సీపీఐ నారాయణ ఘాటుగా స్పందించారు. ఆత్మహత్యలు వద్దని, తిరగబడి పోరాడాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్య చేసుకోవాల్సింది ప్రజలు కాదని, మాట ఇచ్చి మోసం చేసిన నేతలు సిగ్గుతో ఆత్మహత్య చేసుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News