: ఓట్ల తొలగింపు ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రే: కిషన్ రెడ్డి


త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో ఉంచుకొనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల తొలగింపుకు పాల్పడుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆధార్ కార్డ్ లింక్ తో ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని అన్నారు. మరోవైపు, గుడుంబా అరికట్టాలనే నెపంతో చీప్ లిక్కర్ ను భారీ ఎత్తున ప్రవేశపెడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మెడికల్ కాలేజీలపై ప్రేమ కురిపిస్తున్న ప్రభుత్వం... ఇంజినీరింగ్ కాలేజీలపై శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News