: ట్రెంట్ బ్రిడ్జ్ లాంఛనం ముగిసింది... క్లార్క్ సేనకు దారుణ పరాభవం


ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా దారుణ పరాభవం చవిచూసింది. అన్ని రంగాల్లో రాణించిన ఆతిథ్య ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో జయభేరి మోగించి ఐదు టెస్టుల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ తొలిరోజే ఆసీస్ పరాజయం ఖాయమైంది. స్టూవర్ట్ బ్రాడ్ సూపర్ స్పెల్ తో తొలి ఇన్నింగ్స్ లో 60 పరుగులకే ఆలౌటైన కంగారూలు, ఆపై కోలుకోలేదు. తొలి ఇన్నింగ్సును ఇంగ్లాండ్ 9 వికెట్లకు 391 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారీ లోటుతో బరిలో దిగిన ఆస్ట్రేలియన్లు రెండో ఇన్నింగ్స్ లో 253 పరుగులకు చాపచుట్టేశారు. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 6 వికెట్లు తీసి కంగారూల పతనంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను హడలెత్తించిన బ్రాడ్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది.

  • Loading...

More Telugu News