: జగన్ తన దీక్షను సోనియా ఇంటి ముందు చేసుకోవాలి: గాలి ముద్దుకృష్ణమ నాయుడు


ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించేటప్పుడు చంద్రబాబు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా... ఇప్పుడు విమర్శించడం అనైతికమని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ప్రత్యేక హోదాను అసలు బిల్లులోనే పెట్టకపోవడం దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్ నియమించిన రఘురాం రాజన్, వైవీ రెడ్డి కమిటీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పాయని అన్నారు. అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం టీడీపీ ప్రయత్నిస్తూనే ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో జగన్ దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని... ఒక వేళ దీక్ష చేయాలనుకుంటే సోనియాగాంధీ ఇంటి ముందు చేసుకోవాలని సూచించారు. మరోవైపు, జగన్ అవినీతిలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పాత్ర కూడా ఉందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News