: టీఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా సెటిలర్ల ఓట్లు తొలగిస్తోంది: కాట్రగడ్డ ప్రసూన
సెటిలర్లపై టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే, సెటిలర్స్ ఫోరం అధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మండిపడ్డారు. ఒక పద్ధతి ప్రకారం హైదరాబాదులోని సెటిలర్స్ ఓట్లను ప్రభుత్వం తొలగిస్తోందని మండిపడ్డారు. సనత్ నగర్ నియోజకవర్గంలో భారీ ఎత్తున ఓట్ల తొలగింపు చోటుచేసుకుందని అన్నారు. ప్రభుత్వ కుట్రకు వ్యతిరేకంగా బల్కంపేట వద్ద ప్రసూన ఆందోళన చేపట్టారు.