: ఆ రెండింటినీ పూజించినంత కాలం ఐఎస్ఐఎస్ మనల్నేమీ చేయలేదు: యోగి ఆదిత్యనాథ్


దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో యువత ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూపు పట్ల ఆకర్షితం కావడంపై బీజేపీ నేత, గోరఖ్ పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. హర్యానాలోని భివానీ జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ... ఐఎస్ తదుపరి లక్ష్యం భారతదేశమేనని, అయితే, గంగను, గోవును పూజించినంత కాలం మనల్ని ఎవరూ, ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఐఎస్ ముప్పును ఎదుర్కొనేందుకు భారత యువత సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతకుముందు, ముంబయికి చెందిన నలుగురు యువకులు ఐఎస్ గ్రూపులో చేరారన్న కథనాలు కలవర పరుస్తున్నాయని, ఈ పరిణామాల నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలని ఆదిత్యనాథ్ అన్నారు.

  • Loading...

More Telugu News