: రాష్ట్రానికి తప్పకుండా ప్రత్యేక ప్యాకేజీ వస్తుంది: సుజనా చౌదరి
ఆంధ్రప్రదేశ్ కు తప్పకుండా ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. కృష్ణా జిల్లా అగిరపల్లిలో మంత్రి కామినేని శ్రీనివాస్ తో కలసి ఆయన వైద్య ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో సుజనా మాట్లాడుతూ, నిపుణుల కమిటీతో చర్చించాక హోదాపై స్పష్టత వస్తుందని తెలిపారు. అంతవరకు ఆగాల్సి ఉందన్నారు. ఇదిలాఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అంతా డిమాండ్ చేస్తుంటే సుజనా మాత్రం ప్యాకేజీ అనటం పలువురికి ఆగ్రహం తెప్పించకమానదు.