: జస్టిస్ మిశ్రాకు అందిన బెదిరింపు లేఖలో ఏముందంటే...!
1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమన్ ఉరిని ఖరారు చేసిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు నిన్న బెదిరింపు లేఖ అందిన వైనం కలకలం రేపింది. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లో ఉన్న జస్టిస్ మిశ్రా అధికారిక నివాసం వెనుక వైపుగా వచ్చిన గుర్తు తెలియని దుండగులు, ఆయన ఇంటి పెరడులో లేఖను విసిరివెళ్లారు. ఈ లేఖలో దుండగులు జస్టిస్ మిశ్రాకు గట్టి హెచ్చరికలే చేశారు. ‘‘ఎంత భద్రత ఉన్నా వదిలిపెట్టం. నిన్ను చంపేస్తాం’’ అని ఆ లేఖలో దుండగులు జస్టిస్ మిశ్రాకు వార్నింగ్ ఇచ్చారు.