: మినీ స్కర్టుతో పోజులిచ్చిన నయా ఆధ్యాత్మికవేత్త... వరకట్న వేధింపుల కేసు పెట్టడంతో పరారు


తాను జగన్మాత అవతారాన్ననని చెప్పుకుంటూ ప్రజలను ఆకర్షిస్తున్న రాధే మా అలియాస్ సుఖ్విందర్ కౌర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టైట్ మినీ స్కర్టు ధరించి కిర్రెక్కించే పోజులిచ్చిన ఈ ఆధ్యాత్మికవేత్తపై తాజాగా వరకట్న వేధింపుల కేసు నమోదైంది. తనపై కేసు నమోదవడంతో రాధే మా పరారయింది. ఆమె కోసం ముంబయి పోలీసులు గాలింపు చేపట్టారు. నక్కీ గుప్తా అనే మహిళ తన అత్తామామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, వారికి రాధే మా వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాధే మాపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. రాధే మా గత జీవితాన్ని ఓసారి పరికిస్తే... పంజాబ్ లోని ఓ కుగ్రామం ఆమె స్వస్థలం. పేద కుటుంబంలో పుట్టిన ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సుఖ్విందర్. చిన్ననాటే, ఆమెకు దివ్యశక్తులు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. దాంతో ఆమె కూడా తాను దేవతనని బలంగా నమ్మింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. అయితే, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో మళ్లీ ఆధ్యాత్మికత వైపు అడుగులేసింది. ముంబయి వెళ్లి తన బోధనలతో పెద్ద ఎత్తున ప్రజలను ఆకట్టుకుని, రాధే మా పేరుతో బాగా పాప్యులరైంది. భక్తులు ఆమెకు పుష్పాభిషేకం చేయడమే కాదు, వీధుల్లో ఊరేగింపు సేవలు నిర్వహిస్తుంటారు. ఇటీవలే నాసిక్ కుంభమేళా నుంచి ఈమెను బహిష్కరించారు. ఆమె చిట్టిపొట్టి డ్రెస్సులు ధరించి డ్యాన్సులు చేస్తున్న వీడియో ఒకటి తెరపైకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News