: నాలుగురోజుల తరువాత పుంజుకున్న బంగారం, వెండి ధరలు
నాలుగు రోజుల తగ్గుదల తరువాత బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. ఈ రోజు రూ.190 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.25,170 పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.330 పెరగడంతో కిలో ధర రూ.34,130 పలుకుతోంది. విదేశీ మార్కెట్ల నుంచి సానుకూలత, నగల వ్యాపారులు, పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టడంతో వీటి విలువ పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.