: 'బ్యాడ్జ్' కోసం విమానంలోంచి దూకేందుకు సిద్ధమైన ధోనీ


టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందిన విషయం తెలిసిందే. ఆ హోదాలో ధోనీ పలుమార్లు మిలిటరీ బేస్ లను సందర్శించాడు కూడా. తాజాగా, ఈ జార్ఖండ్ డైనమైట్ ఆగ్రా కంటోన్మెంట్ కు విచ్చేశాడు. తన యూనిఫాంపై 'పారాచ్యూట్ వింగ్స్' బ్యాడ్జ్ ను సగర్వంగా ప్రదర్శించాలన్నది ధోనీ ఆకాంక్ష. మరి, ఆ బ్యాడ్జ్ దక్కాలంటే సాహసం చేయాలి. అందుకు సై అంటున్నాడు ధోనీ. ఆగ్రా కంటోన్మెంట్ సెంటర్ కు ఈ ఉదయం చేరుకున్న టీమిండియా వన్డే జట్టు సారథి కఠోర శ్రమకు సిద్ధమయ్యాడు. కనీసం 4 వారాల కఠిన శిక్షణ అనంతరం ధోనీ ఏఎన్-32 యుద్ధ విమానంలో 10,000 అడుగుల ఎత్తు నుంచి ఐదుసార్లు పారా జంప్ చేయాల్సి ఉంటుంది. విజయవంతమైతే బ్యాడ్జ్ ప్రదానం చేస్తారు. ధైర్యానికి మారుపేరుగా నిలిచే ధోనీ ఈ బ్యాడ్జ్ ను సాధించడం ఖాయమేనని అభిమానులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News