: లలిత్ నుంచి ఎంత తీసుకున్నారో సుష్మా స్వరాజ్ చెప్పాలి!: రాహుల్ గాంధీ


ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ విషయంలో లోక్ సభలో సుష్మా స్వరాజ్ మరోసారి ఇచ్చిన భావోద్వేగ వివరణపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. "అది చాలా మంచి ప్రసంగం, కానీ అంతా డొల్లగా ఉంది. అయితే, వినేందుకు మాత్రం చాలా బాగుంది. తన స్థానంలో సోనియా ఉంటే ఇలాగే చేసేవారని సుష్మ అన్నారు. ఆమె (సోనియా) కుమారుడిగా చెబుతున్నా, సుష్మా చేసినట్టు సోనియా చేసి ఉండేవారు కాదు" అని రాహుల్ పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే, ఎక్కడైతే దొంగతనం జరుగుతుందో ఆ విషయాన్ని దొంగ చాలా రహస్యంగా ఉంచుతాడన్నారు. అలాగే, సుష్మాజీ లలిత్ విషయంలో పూర్తిగా రహస్యం పాటించారని ఆరోపించారు. ఆ వ్యవహారంపై సుష్మా స్వరాజ్ కు తప్ప విదేశాంగమంత్రిత్వ శాఖలో ఎవరికీ తెలియదన్నారు. ఆ నిర్ణయం తరువాతే బ్రిటన్ ప్రభుత్వం తన మాటను మార్చుకుందని రాహుల్ పేర్కొన్నారు. అయితే లలిత్ మోదీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు అతని నుంచి సుష్మ ఎంత డబ్బు తీసుకున్నారో జాతికి చెప్పాలని రాహుల్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News