: గ్రేటర్ పరిధిలో 34 లక్షల ఓట్లు గల్లంతు... భన్వర్ లాల్ కు టీ టీడీపీ ఫిర్యాదు


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో ఒక్కసారిగా 34 లక్షల ఓట్లు గల్లంతయ్యాయట. అది కూడా టీడీపీ, బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లోని ఓట్లే కనిపించకుండాపోయాయట. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం టీ టీడీపీ ఎమ్మెల్యేలు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఎలక్షన్ కమిషనర్ భన్వర్ లాల్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదులో జనం ఒక్కసారిగా ఈ మేర తగ్గిపోయిందా? అని కూడా వారు భన్వర్ లాల్ ను ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ సర్కారు ఓట్లను తొలగిస్తోందని వారు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News