: జయలలిత ఆహ్వానంతో నివాసానికి వెళ్లిన మోదీ... 'అమ్మ'తో కలసి భోజనం
చెన్నైలో ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనంతరం సీఎం జయలలిత ఆహ్వానం మేరకు ఆమె నివాసం పొయెస్ గార్డెన్ కి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానికి పుష్పగుచ్చంతో జయ స్వాగతం పలికారు. తరువాత సమావేశమైన వారు పలు విషయాలపై చర్చించారు. అనంతరం మోదీ అక్కడే భోజనం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బయటపడి జయ మళ్లీ సీఎం అయ్యాక చెన్నైలో మోదీ పర్యటించడం ఇదే మొదటిసారి.