: ‘కాంట్రాక్టు’ రెగ్యులరైజేషన్ తర్వాతే ఉద్యోగాల భర్తీ...కొత్త మెలిక పెట్టిన కడియం శ్రీహరి
తెలంగాణలో నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే, కొద్దిసేపటి క్రితం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కొత్త మెలిక పెడుతూ ఓ ప్రకటన చేశారు. వివిధ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే కొత్త ఉద్యోగాల భర్తీని చేపడతామని ఆయన పేర్కొన్నారు. దీంతో నేడో, రేపో వస్తుందనుకుంటున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ పై అయోమయం నెలకొంది.