: పొగాకు రైతుల సమస్యలపై వైసీపీ వినతికి వెంకయ్య స్పందన


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పొగాకు రైతుల సమస్యలపై స్పందించారు. వెంటనే పొగాకు బోర్డు ఛైర్మన్ తో ఫోన్ లో మాట్లాడి, పొగాకు కొనుగోలు చేసేందుకు రెండు, మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పొగాకు మద్దతు ధరలో వ్యత్యాసం ఎందుకు చూపుతున్నారని బోర్డు ఛైర్మన్ ను ప్రశ్నించారు. తక్షణమే ఐటీసీతో మాట్లాడి రైతులకు ఇచ్చిన ధరలను చెల్లించేలా చూడాలని సూచించారు. ఈ రోజు పొగాకు రైతుల సమస్యలపై మంత్రి వెంకయ్యను ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వరప్రసాద్ కలసి విన్నవించారు. ఈ క్రమంలోనే మంత్రి పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News