: ఇంకా అనారోగ్యంతోనే బాధపడుతున్న జయలలిత
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం ఇంకా కుదుటపడినట్టు లేదు. ఆమె ఇంకా అనారోగ్యంతోనే బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు. 'జాతీయ చేనేత దినోత్సవం' కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని మోదీ ఈరోజు చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా, విమానాశ్రయంలో గవర్నర్ రోశయ్యతో కలసి మోదీకి ఘన స్వాగతం పలికారు జయలలిత. ఆ తర్వాత, మోదీ, రోశయ్యలు చేనేత కార్యక్రమంలో పాల్గొనడానికి మద్రాస్ యూనివర్శిటీకి వెళ్లారు. అయితే, ఆ కార్యక్రమానికి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరయ్యారు. ఈ సందర్భంగా, జయలలిత ప్రసంగ పాఠాన్ని పన్నీర్ సెల్వం చదివి వినిపించారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమానికి జయలలిత రాకపోవడంతో, ఆమె ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని అందరూ భావిస్తున్నారు.