: 27న ఉస్మానియాకు రాహుల్... తెలంగాణలో యువరాజు పర్యటన ఖరారు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న హైదరాబాదు రానున్న రాహుల్ గాంధీ, అదే రోజు ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న విద్యార్థి ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 28న వరంగల్ జిల్లా వెళ్లనున్న ఆయన వరంగల్ నగరంతో పాటు జిల్లాలోని భూపాలపల్లిలోనూ పర్యటిస్తారు. ఇటీవల రైతు భరోసా యాత్ర పేరిట ఆదిలాబాదు జిల్లాలో రాహుల్ చేపట్టిన యాత్రకు భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. నాటి పర్యటన కంటే తాజా పర్యటనను దిగ్విజయం చేయాలని టీ పీసీసీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓయూ విద్యార్థులతో కలిసి నేటి సాయంత్రం రాహుల్ తో భేటీ కానున్నారు.