: ‘లెక్క’లపై పిల్లిమొగ్గలొద్దు... తెలుగు రాష్ట్రాలకు కృష్ణా రివర్ బోర్డు అక్షింతలు


నీటి వాటాలపై నిత్యం తగవులాడుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల యాజమాన్య బోర్డు తలంటింది. వినియోగించుకున్న నీటి వాటాలపై లెక్కలు సమర్పించడంలో తాత్సారం చేస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 2014-15 జల సంవత్సరానికి సంబంధించి ప్రాజెక్టులవారీగా వాడుకున్న నీటికి సంబంధించిన వివరాలను సమర్పించాలని బోర్డు రెండు రాష్ట్రాలను కోరిన విషయం తెలిసిందే. అయితే పూర్తి స్థాయి వివరాలను ఇచ్చేందుకు అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణ కూడా ఆసక్తి కనబరచడం లేదట. ఆసక్తి కనబరచడం లేదనేదానికంటే పూర్తి వివరాలిచ్చేందుకు ఇరు రాష్ట్రాలు నిరాకరిస్తున్నాయట. దీంతో విషయం గ్రహించిన బోర్డు తాజాగా రెండు రాష్ట్రాలకు శ్రీముఖాలు జారీ చేసింది. తక్షణమే ప్రాజెక్టులవారీగా వాడుకున్న నీటి వాటాలపై పూర్తి వివరాలు వెల్లడి చేయాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది. కృష్ణా డెల్టా, సాగర్ కుడి కాల్వ, పోతిరెడ్డిపాడు లెక్కలను ఏపీ దాస్తోంటే... కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఊకచెట్టువాగు, ఏఆర్ఎంపీ, సాగర్ ఎడమ కాల్వలకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఇవ్వడం లేదట.

  • Loading...

More Telugu News