: ప్రధాని మోదీకి స్వాగతం పలికిన జయలలిత
భారత ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు తమిళనాడు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, ఇతర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో ఎక్కడకూ రాని జయలలిత... ఈ రోజు విమానాశ్రయానికి వచ్చి ప్రధాని మోదీకి స్వాగతం పలకడం గమనార్హం. కాసేపట్లో మద్రాస్ యూనివర్సిటీలో జరగనున్న కార్యక్రమంలో 'జాతీయ చేనేత దినోత్సవాన్ని' మోదీ ప్రారంభించనున్నారు. మోదీ రాక సందర్భంగా చెన్నైలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.