: సింహాద్రి అప్పన్న సన్నిధిలో అగ్ని ప్రమాదం


విశాఖ జిల్లాలోని సింహాచలంలో వేంచేసివున్న అప్పన్న సన్నిధిలో గత రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో 8 దుకాణాలు దగ్ధమయ్యాయి. రాత్రిపూట కావడంతో ప్రాణనష్టం ఏమీ జరగనప్పటికీ, భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఫైరింజన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు. భక్తుల స్వామివారి దర్శనానికి ఎటువంటి ఆటంకాలు లేవని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News