: గౌతమ్ గంభీర్, సల్మాన్ ఖాన్ మధ్య బంధుత్వానికి బాటలు వేసిన అర్పిత మరిది
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహం ఆయుష్ శర్మతో హైదరాబాదులో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయుష్ శర్మ సోదరుడు ఆశ్రయ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వధువు ఎవరో కాదు... సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కజిన్. పేరు రాధికా గంభీర్. ఇటీవలే ఢిల్లీలో రాధిక, ఆశ్రయ్ లకు నిశ్చితార్థం అయింది. ఈ ఏడాది డిసెంబర్ లో వీరి వివాహం జరగనుంది. ఈ పెళ్లితో గంభీర్, సల్మాన్ బంధువులు కానున్నారు. రాధిక న్యాయవాది కాగా, ఆశ్రయ్ కుటుంబ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు.