: ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఘాటైన లేఖ
ప్రాజెక్టుల విషయమై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఏపీ ప్రభుత్వానికి ఘాటైన లేఖ రాశారు. తమ హక్కు ప్రకారమే ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని, ఏపీ ప్రజల దృష్టి మరల్చేందుకే పాలమూరు, డిండి ప్రాజెక్టులపై టీడీపీ లేఖల డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను తప్పుబడుతున్న ఏపీ సర్కారు పట్టిసీమ ప్రాజెక్టు ఎవరి అనుమతితో కడుతోందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా పాలమూరు ప్రాజెక్టుకు మొగ్గుచూపారని హరీశ్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధించని చంద్రబాబుపై ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహం పెరిగాయని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు.