: సైన్యం చేతిలో మరో ఉగ్రవాది హతం


జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల జిల్లాల్లో ఉగ్ర కలకలం నెలకొంది. ఉధంపూర్ జిల్లాలో బుధవారం ఓ టెర్రరిస్టును కాల్చి చంపిన భద్రతా బలగాలు, మరొకడిని సజీవంగా పట్టుకోవడం తెలిసిందే. గురువారం పుల్వామా జిల్లా ఆస్థాన్ మొహల్లా ప్రాంతంలోని కాకపోరాలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సైన్యం అక్కడికి చేరుకుంది. పోలీసులతో కలిసి ఆ ఇంటిని రౌండప్ చేసిన సైన్యం భారీ స్థాయిలో కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో ఓ టెర్రరిస్టు హతం కాగా, మరో ఇద్దరు ఇంట్లోనే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. దాంతో, కాల్పులు కొనసాగిస్తున్నారు. మరణించిన ఉగ్రవాది స్థానికుడే అని, పేరు తాలిబ్ అహ్మద్ అని గుర్తించారు. అతడు లష్కరే తోయిబాకు చెందినవాడని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News