: రహానే సెంచరీ... 300 దాటిన భారత్ స్కోర్


కొలంబోలో శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవెన్ తో జరుగుతున్న ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ రహానే దుమ్ముదులిపాడు. కేవలం 116 బంతులను ఎదుర్కొన్న రహానే 10 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రాహుల్ (43), ధావన్ (62), రోహిత్ శర్మ (7), కోహ్లీ (8), పుజారా (42), సాహా (3) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం రహానే 109, అశ్విన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరో 11 ఓవర్ల మ్యాచ్ మిగిలి ఉంది.

  • Loading...

More Telugu News