: శేషాచలం ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగాలు


ఈ ఏడాది ఏప్రిల్ 7న చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 20 తమిళ కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి కుటుంబాలకు తమిళనాడు సీఎం జయలలిత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ మేరకు ఐదుగురిని ఉద్యోగాల్లో నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తాము చాలా పేదవాళ్లమని, ప్రభుత్వమే ఏదోఒక దారి చూపాలంటూ జయను కొన్ని రోజులుగా బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. దానిని అనుసరించి పలు రకాల ఉద్యోగాల్లో వారిని ప్రభుత్వం నియమించినట్టు అధికారిక ప్రకటనలో తెలిపారు. 17 మంది బాధిత కుటుంబాల వారిని వంట సహాయకులుగా, మరో ఇద్దరిని పోషకాహార సమన్వయకర్తలుగా నియమించారు. ఒకరిని అంగన్ వాడీ సహాయకులుగా నియమించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలాఉంటే నాటి ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారం కూడా ఇచ్చారు.

  • Loading...

More Telugu News