: ఉసూరుమనిపించిన రోహిత్ శర్మ
కొలంబోలో శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవెన్ తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా వెనువెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 108 పరుగులుగా ఉన్నప్పుడు ఓపెనర్ లోకేష్ రాహుల్ (43) ఔటవ్వగా... 121 పరుగుల వద్ద వన్ డౌన్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ (7) రజిత బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శిఖర్ ధావన్ 61 పరుగులతో, విరాట్ కోహ్లీ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుత స్కోరు 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు.