: హైకోర్టు విభజన విషయంలో చంద్రబాబును తప్పుపట్టడం సరికాదు: రేవంత్ రెడ్డి
రెండు రాష్ట్రాలకు హైకోర్టు విభజన విషయంలో చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ టీఆర్ఎస్ ఎంపీ కవిత లోక్ సభలో ఆరోపించడాన్ని టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఖండించారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబును తప్పుపట్టడం సరికాదని చెప్పారు. కోర్టు విభజనకు ఆయన వ్యతిరేకం కాదని అన్నారు. ఏపీ పాలన త్వరలోనే ఆ రాష్ట్రానికి తరలిపోతుందని ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇంకా ఆంధ్రా సెంటిమెంట్ తోనే సీఎం కేసీఆర్ పాలన సాగించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఉస్మానియాలో పేదలకు ఇళ్లు, డబుల్ బెడ్ రూం ప్లాట్లు, ఉస్మానియా ఆసుపత్రి... ఇలా ఎన్నో హామీలను ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు.