: తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల భేటీ... ఉద్యోగుల విభజనపై చర్చ


తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. హైదరాబాదులోని సచివాలయంలో జరుగుతున్న ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య జరగాల్సిన ఉద్యోగుల విభజనపై వీరిద్దరూ ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా రెండు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా పరిష్కారం కాని పలు సమస్యలపైనా వారిద్దరూ చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య ఎడతెగని వివాదంలా మారిన ఉద్యోగుల విభజనకు ఈ భేటీతో ముగింపు లభిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News