: ప్రతిపక్షాలు సభాపతి స్థానాన్ని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నాయి: వెంకయ్యనాయుడు


లోక్ సభలో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు సభాపతి స్థానాన్ని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నాయన్నారు. స్పీకర్ ఇంటి వద్ద దిష్టిబొమ్మ దహనం చేయడం ప్రజాస్వామ్య విలువలకు భంగమని పేర్కొన్నారు. స్పీకర్ ను బెదిరించే ధోరణిలో వ్యవహరించడం సరికాదని సూచించారు. దేశాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని ఆరోపించిన మంత్రి, తమకు 130 ఏళ్ల చరిత్ర ఉందని ఆ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. ఇటువంటి ప్రతిపక్షాల వ్యవహార శైలిని రాజ్యాంగ నిపుణులు కూడా తప్పుబడుతున్నారని వెంకయ్య చెప్పారు. ఇలాంటి వ్యవహారశైలిపై కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News