: 'బచావో తెలంగాణ' సంస్థను ప్రారంభిస్తున్న నాగం?
టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరును తీవ్రతరం చేసేందుకు టి.బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకోసం 'బచావో తెలంగాణ' పేరిట కొత్త వేదికను ఏర్పాటు చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ప్రస్తుతం కనుమరుగైన పలువురిని ఈ సంస్థలో చేర్చుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ సంస్థలో కీలక పాత్ర పోషించనున్నారు. రాజకీయాలకు అతీతంగా అందర్నీ ఇందులో చేర్చుకోనున్నామని, ఉద్యమం సమయంలో జేఏసీ పోషించిన పాత్రను ఇప్పుడు తాము తీసుకుంటామని యెన్నం తెలిపారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రాంతంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారని సమాచారం. బీజేపీలో ఉంటే దూకుడుగా వ్యవహరించలేమని... ప్రస్తుత నేతల మాదిరి ఉంటే రాజకీయ సమాధి అవుతామనే ఆలోచనతోనే నాగం ఈ నిర్ణయం తీసుకున్నారట.