: సులభతరం కానున్న పాస్ పోర్టు రెన్యువల్... పోలీస్ వెరిఫికేషన్ అవసరంలేదన్న కేంద్రం
పాస్ పోర్ట్ రెన్యువల్ ఇక నుంచి మరింత సులభతరం కాబోతుంది. ఇంతకుముందు వరకు పాస్ పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలంటే పోలీస్ వెరిఫికేషన్ అవసరం. ఇందుకు దాదాపు 15 నుంచి 20 రోజుల సమయం పట్టేది. ఇక ముందు పోలీస్ వెరిఫికేషన్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలీసులు పూర్తిగా విచారించి నివేదిక ఇచ్చిన తరువాతే పాస్ పోర్ట్ వస్తుంది కాబట్టి, మళ్లీ వారే వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదని విదేశాంగ వ్యవహార శాఖ సహాయక మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.